Telugu News Power

క్షీరారామం లో శ్రీ బాణ లింగ ప్రతిష్ట ‌

ప్రతిష్టాపన చేయు శ్రీ బాణలింగం
శ్రీ బాణ లింగం స్వీకరిస్తున్న అర్చకులు అనిల్

పాలకొల్లు: ఫిబ్రవరి,13(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో, శుక్రవారం శ్రీ బాణ లింగ ప్రతిష్టాపన శ్రీ సుంగేశ్వరి పీఠాధిపతి ఆదేశముల మేరకు జరిగింది. అమరావతిలో ఉన్న, అమరలింగేశ్వర స్వామి వారి రక్షణ కొరకు, ద్రాక్షారామంలో వేంచేసి ఉన్న ద్రాక్షారామ లింగేశ్వరుడు సంరక్షించుటకుగాను శ్రీ బాణ లింగ ప్రతిష్ట జరిగినది. స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కూడా స్వామివారి సంరక్షణార్థం శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విధుర శేఖర భారతి తీర్థ స్వామి వారి ఆదేశంల మేరకు శ్రీ బాణ లింగ ప్రతిష్ట జరిగినది. ఈ క్రతువులన్నీ, ధార్మిక కమిటీ ఆధ్వర్యంలో జరుగుచున్నవి. శ్రీ బాణ లింగ ప్రతిష్టాపన కార్యక్రమంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్రరావు, ధర్మకర్తలు పినిశెట్టి శ్రీనివాస్ తదితరులు, ఆలయ కార్య నిర్వహణ అధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. అభిషేక పండితులు భమిడిపాటి వెంకన్న, మద్దూరి సూరిబాబు, ఆలయ వైదిక ధార్మిక కమిటీ అధ్యక్షులు రామకృష్ణ, అనిల్, ప్రధాన అర్చకులు క్రిష్టప్ప, పూర్ణయ్య, వీరబాబు ప్రతిష్టాపన పూజాధికాలు నిర్వహించారు.

శ్రీ బాణ లింగం ప్రతిష్టాపన పూజ