Telugu News Power

ఛాంబర్స్ కళాశాలలో జీల్ ఇండియా ఉద్యోగాలు.

పాలకొల్లు: ఫిబ్రవరి,23(తెలుగు న్యూస్ పవర్)చాంబర్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో. ఈనెల 25న ఉదయం 10 గంటలకు జీల్ ఇండియా కంపెనీలో ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు జరుగుతాయని చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు తెలిపారు.చాంబర్స్ కళాశాల ప్లేస్మెంట్స్ లో ముందుంటుందని దానిలో భాగంగా, జీల్ ఇండియా కంపెనీలో ఉద్యోగుల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఏదైన డిగ్రీ లేదా ఆపైన చదివిన వారు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు 18 నుంచి 20 వేల రూపాయలు వరకు జీతం ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఈ క్యాంపస్ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. వివరములకు 9912046234, 9849 712739 నెంబర్లలో సంప్రదించవచ్చు అని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వరరావు గారు తెలియజేశారు.