Skip to main content

Telugu News Power

చెవిలో పట్టే రక్షణ పరికరం కనుగొన్న దక్షిణాఫ్రికా యువతి.

ఇయర్ ఫోన్ రక్షణ పరికరం ప్రదర్శిస్తున్న యువతీ

లింపోపో ప్రావిన్స్: దక్షిణాఫ్రికాకు చెందిన, బోహాలే ఎంఫహెలెలే అనే యువతీ చెవిలో పెట్టుకునే ఇయర్ ఫోన్ లా ఉండే ఓ రక్షణ పరికరాన్ని కనిపెట్టింది. చూడటానికి మీది ఇయర్ ఫోన్లో ఉన్నప్పటికీ ఇందులో అత్యధిక సాంకేతికత తో ఒక రక్షణ పరికరంగా రూపొందించారు. ఎవరైనా ఈ ఇయర్ ఫోన్ ధరించిన వారు దాడికి గురైనప్పుడు అత్యవసరంగా ఈ పరికరం ఫోటోలు తీస్తుంది. జిపిఎస్ పద్ధతిలో ప్రమాద హెచ్చరికలు లోకేషన్ తో పాటు పోలీసులకు, ఎమర్జెన్సీ నెంబర్లకు పంపుతుంది. దక్షిణాఫ్రికా సమాజం ప్రస్తుతం ఎదుర్కొంటున్న మహిళలపై లైంగిక దాడులు, మానవ అక్రమ రవాణా, మహిళలపై వివక్ష వంటి వాటి నుంచి రక్షణ పొందటానికి ఈ పరికరం కనిపెట్టినట్టు ఆమె తెలిపారు. ప్రస్తుతం ఈ పరికరం ప్రయోగ దశలో ఉంది ‌ యువ శాస్త్రవేత్తల ఆవిష్కరణలో ఈ పరికరానికి కాంస్య పథకం దక్కింది. ఈ పరికరం వాణిజ్య పరంగా, అందుబాటులోకి వస్తే, ఎందరో యువతలను ప్రమాదాల నుంచి కాపాడే అవకాశం ఉంది.