Telugu News Power

బాణాసంచా ప్రమాద నివారణ తనిఖీలు.

వేట్లపాలెం వద్ద సంభవించిన బాణాసంచా తయారీ కేంద్ర వద్ద ప్రమాదం

పాలకొల్లు: మార్చి, 1(తెలుగు న్యూస్ పవర్) ఇటీవల మానవ తప్పిదం వల్ల సంభవించిన, కాకినాడ జిల్లా, వేట్లపాలెం లో బాణాసంచా తయారీ ప్రాంతం వద్ద సంభవించిన భారీ విస్పోటనంతో, రాష్ట్రంలో నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆయా శాఖలు అప్రమత్తం అయ్యాయి. స్థానిక బాణాసంచా తయారీ,విక్రయ కేంద్రాలపై నేరుగా క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ హష్మీ ఆదేశాల మేరకు చురుగ్గా తనిఖీలు చేస్తున్నారు. ప్రజల ప్రాణ, ఆస్థి రక్షణ కోసం రక్షకబట వ్యవస్థ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రేలుడు పదార్థాల చట్టం ప్రకారం ఆయా బాణాసంచా తయారీ కేంద్రాలు, దుకాణాలు నిబంధనలు పాటించాలని నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా శిక్షకు అర్హులవుతారని హెచ్చరికలు జారీ చేశారు. పట్టణ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కే రజిని కుమార్ ఆధ్వర్యంలో, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జీజే ప్రసాద్, వారి సిబ్బంది ఈ తణిఖీల్లో పాల్గొంటున్నారు.