Skip to main content

Telugu News Power

ఒక ఐడియా, క్షణాల్లో కాసులు కురిపించవచ్చు.

ఇండియా,మంచు పర్వత శ్రేణి: మార్చి, 1(తెలుగు న్యూస్ పవర్) అదో అంకుర సంస్థ కాదు, నిధులు సమీకరించింది లేదు. కేవలం పర్వతాల్లో వేడి వేడి మ్యాగీ అమ్మి వైరల్ అయిన కంటెంట్ క్రియేటర్!
అతను చేసిన పని ఒక్కటే, పర్వతాల్లో మ్యాగీ అమ్మడం.
ఒక కంటెంట్ క్రియేటర్ ఒకరోజు ప్రయోగంగా ఈ ఆలోచనను అమలు చేశాడు. ఒక ప్లేట్ ఖరీదు
70 రూపాయల చొప్పున 300 పైగా ప్లేట్లు అమ్మాడు. ఒకే రోజులో సుమారు 21 వేల రూపాయలు సంపాదించి నట్టు ప్రకటించాడు.ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కామెంట్లు మరింత ఆసక్తికరంగా మారాయి.“జాబ్ వదిలేశావా?”
“ఇంటర్న్‌షిప్ దొరుకుతుందా?” అని. ఈ సంఘటన మరోసారి నిరూపించింది ఏంటంటే, ఒక ఐడియా, క్షణాల్లోనే కాసులు కురిపించవచ్చని.సరైన ప్రదేశంలో సరళమైన ఆలోచన కూడా భారీ చర్చకు దారితీస్తుంది.
కొన్ని సందర్భాల్లో కొత్త ఐడియా అవసరం ఉండకపోవచ్చు, కాని, కొత్త ప్రాంతం, అందుకు తగ్గ పరిస్థితులు ఉంటే చాలు!
ఇలాంటి మరిన్ని ఆసక్తికర కథనాల కోసం మా వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి.