పాలకొల్లు: మార్చి,1(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల cc శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు స్వగ్రామం ఆగర్తిపాలెం ఆదివారం శ్రమదానం చేశారు. బయోఫోర్ ఫార్మా కంపెనీ తన సి ఎస్ ఆర్ నిధుల నుంచి 20 లక్షల రూపాయలు, ఓఎన్జిసి, సిఎస్సార్ నిధుల నుంచి 15 లక్షలు, నరసింహ 35 లక్షలతో, అపర కర్మలు నిర్వహించే సౌకర్యాలు, స్మశాన సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. మంత్రి నిమ్మల, గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేశారు. ఇంటికొకరు చొప్పున గ్రామస్తులు ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. పని నిరంతరం సాగటానికి వంతులు వారీగా సమాధానం చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఐకమత్యం వెల్లివిరిసిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆనందం వ్యక్తం చేశారు.