Telugu News Power

100 కోట్ల ప్రాజెక్ట్ కు అధిపతి, అప్పటికి వయసు పదహారే

భారతీయ మూలాలున్న ఫ్లోరిడా యువతి అవస్థి

ఫ్లోరిడా: మార్చి, 3 (తెలుగు న్యూస్ పవర్. కాం) ఫ్లోరిడాలో పెరిగిన భారతీయ యువతి ప్రంజలి అవస్థి16 ఏళ్ల వయసులో,స్టార్టప్ డెల్వ్.ఏఐ స్థాపించి రూ.100 కోట్ల విలువైన విజయం సాధించిన ప్రేరణాత్మక గాథ!భారత్‌లో జన్మించి 11 ఏళ్ల వయసులో అమెరికా ఫ్లోరిడాకు తరలి వచ్చిన 16 ఏళ్ల ప్రంజలి అవస్థి, ఇంకా హైస్కూల్ పూర్తి చేయకముందే 2022 జనవరిలో డెల్వ్.ఏఐ(డిఇల్ వి.ఏఐ) అనే ఏఐ-ఆధారిత పరిశోధన వేదిక స్థాపించింది. ఈ వేదిక పరిశోధకులకు విద్యా సంబంధమైన విషయాన్ని(అకడమిక్ కంటెంట్), పిడిఎఫ్ ల నుంచి సమాచారాన్ని సేకరించి, క్రోడీకరించి, సంఘటించడంలో సహాయపడుతుంది. ఇది డేటా సైలోలను తొలగించి, పరిశోధన పనులను 75 శాతం వరకు తగ్గించి, సమయాన్ని ఆదా చేస్తుంది.7 ఏళ్ల వయసు నుంచే తండ్రి మార్గదర్శకత్వంలో కోడింగ్ నేర్చుకున్న ప్రంజలి, 13 ఏళ్లలో ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో మెషిన్ లెర్నింగ్ ఇంటర్న్‌షిప్ చేసింది. మియామీ యాక్సిలరేటర్, బ్యాక్ఎండ్ క్యాపిటల్, విలేజ్ గ్లోబల్ వంటి పెట్టుబడిదారుల నుంచి రూ.3.7 కోట్లు (450 వేల డాలర్లు) నిధులు సేకరించింది. ఒక సంవత్సరంలోనే డెల్వ్.ఎఐ రూ.100 కోట్లకు (12 మిలియన్ డాలర్లు) చేరింది. ప్రస్తుతం 10వేలకు పైగా యూజర్లు,
10 మంది టీమ్‌తో మియామీలో పనిచేస్తోంది.ప్రంజలి కేవలం స్థాపకురాలిగా మాత్రమే కాకుండా, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, ఆపరేషన్స్ నిర్వహణలో కూడా మార్గదర్శనం చేస్తోంది. ఇప్పుడు 18 ఏళ్ల వయసులో జార్జియా టెక్‌లో కంప్యూటర్ సైన్స్ చదువుతూ, కొత్త ఎఐ టూల్ డాష్ (“చాట్ జిపిటి విత్ హాండ్స్”)పై పని చేస్తోంది. ఆమె విజయం యువతకు, మహిళలకు ఏఐ రంగంలోకి స్ఫూర్తిగా ఆకర్షిస్తుంది —వయసు కలలకు అడ్డు కాదని నిరూపిస్తోంది. భారతీయ యువతి నుంచి గ్లోబల్ టెక్ లీడర్‌గా మారిన ప్రంజలి అవస్థి కథ, చిన్నప్పటి నుంచే ప్రారంభించి, ప్రపంచాన్ని మార్చగలం అని రుజువు చేస్తుంది.