హైదరాబాద్: మార్చి, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్) అల్లు వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. పాలకొల్లు ముద్దుబిడ్డ, విఖ్యాత హాస్యనటులు, అల్లు రామలింగయ్య, మనవడు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, పాన్ ఇండియా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు, మెగా మేనల్లుడు అల్లు శిరీష్ వివాహం ఈనెల 6న జరగనుంది. వివాహ వేడుకల్లో భాగంగా, మంగళవారం ఫ్రివెడ్డింగ్ షూట్ జరిగింది. కాబోయే దంపతులు, నయనిక రెడ్డి, అల్లు శిరీష్ ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అత్యంత భారీగా జరిగిన ఈ వివాహ వేడుకకు చిత్ర జగత్ తారలంతా దిగి వచ్చారు. రాజకీయ ప్రముఖులు, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, నటులు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నారా భువనేశ్వరి, ఉపసభాపతి రఘురాం కృష్ణంరాజు, దర్శకుడు శ్రీనువైట్ల, వి వి నాయక్, అనిల్ రావిపూడి తదితరులు, మెగా ఫ్యామిలీ రామ్ చరణ్ ఉపాసన,అక్కినేని నాగార్జున, మోహన్ బాబు, నాని, నవీన్ పోలిశెట్టి, రాణా, కొత్త దంపతులు విజయ్ దేవరకొండ రష్మిక మదన్న తదితర ఎందరో సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.


