Telugu News Power

కలెక్టరేట్‌లో సామాన్యులకు లిఫ్ట్ సౌకర్యం.

అర్జీదారుతో కలిసి లిఫ్ట్ లో వెళుతున్న కలెక్టర్ నాగరాణి

భీమవరం: మార్చి, 3(తెలుగు న్యూస్ పవర్.కామ్) సామాన్యుల కోసం కలెక్టరేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ను సోమవారం జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుండి అర్జీల సమర్పణకు, ముఖ్యంగా సోమవారం జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వందలాది మంది ప్రజలు కలెక్టరేట్‌కు వస్తున్నారని తెలిపారు.పై అంతస్తులకు చేరుకునేందుకు వృద్ధులు, దివ్యాంగులు పడుతున్న ఇబ్బందులను తీవ్ర ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రూ.10 లక్షల వ్యయంతో లిఫ్ట్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అవసరమైన వారు లిఫ్ట్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి. శివన్నారాయణ రెడ్డి, కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ ఎం. సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.