Telugu News Power

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పవన్ కళ్యాణ్.

ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్న పంచాయతీరాజ్ శాఖామాత్యులు పవన్ కళ్యాణ్

అమరావతి: మార్చి,3(తెలుగు న్యూస్ పవర్. కామ్)
గ్రామాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మాత్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ మంగళవారం ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలో ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి, పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు సంపూర్ణ సహకారం అందించి, నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా, గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలనే సంకల్పానికి బలమిస్తూ తగిన నిధులు సమకూరుస్తున్నారన్నారు. సుదీర్ఘం సాగిన సమావేశంలో జల్ జీవన్ మిషన్ ప్రాజెక్ట్ పనులు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మాణం మరింత వేగవంతానికి విలువైన సూచనలు అందించారని వెల్లడించారు.ముఖ్యమంత్రివర్యుల సూచనలు అనుసరిస్తూ వికసిత్ భారత్ లక్ష్యంలో భాగమవుతామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.