Telugu News Power

కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు -మంత్రి నిమ్మల

శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి నిమ్మల

యలమంచిలి: మార్చి, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్)
కూటమి ప్రభుత్వంల అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.పాలకొల్లు నియోజకవర్గం లో రూ.1 కోటి 2 లక్షలతో జరిగే పలు అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల ఆదివారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో భాగంగా యలమంచిలి మండలం అడవిపాలెం గ్రామంలో రూ 18 లక్షలతో మంచినీటి పథకం మైక్రో ఫిల్టర్ పనులకు కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అడవి పాలు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. కాంబోట్లపాలెం, అబ్బిరాజు పాలెం, గంగడుపాలెం, నార్ని మెరక, ఇలపకుర్రు, పెనుమర్రు, ఆర్య పేట, మేడపాడు, బాడవ, లక్ష్మీ పాలెం, కంచుస్తంభంపాలెం, కనకాయలంక, మండల పరిషత్ పాఠశాలలకు గాను కోటి రెండు లక్షల రూపాయల నిధులతో ప్రారంభించనున్న పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో, ఎంపీడీవో ప్రసాద్, మండల టిడిపి అధ్యక్షులు, మామిడి శెట్టి పెద్దిరాజు, తెలుగు రైతు అధ్యక్షులు చెరుకూరి అంజిబాబు, ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మి,మాజీ జడ్పిటిసి బోనం నాని, సర్పంచుల ఛాంబర్ మాజీ అధ్యక్షులు కడలి గోపి, నీటి సంఘం అధ్యక్షులు ఆరమిల్లి రామ శ్రీనివాస్, రుద్రరాజు సత్యనారాయణ రాజు, దేవ సూర్యప్రభ, తదితరులు పాల్గొన్నారు.