పాలకొల్లు: జులై,21( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో చేరుగాంచిన ఆనంద సాయి స్వీట్స్ అండ్ బేకరి అధినేత కోరాడ గోవిందరాజులు, ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈనేపధ్యంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ గోవిందరాజులును మంగళవారం స్వయంగా వచ్చి సత్కరించారు. ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి పదవి అందుకున్న సందర్భంగా,అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసిరెడ్డి శ్రీనివాస్, శ్రీకన్య హోటల్ అధినేత కేశవరాజు, సీనియర్ పాత్రికేయులు, పి ఆర్ ఓ విన్నకోట వెంకటరమణ, ప్రెస్ అక్రిడేషన్ కమిటీ అధ్యక్షులు సంకు సుబ్రహ్మణ్యం, జిన్నూరు కేబుల్ సూరి తదితరులు పాల్గొన్నారు.
ఆనంద సాయి గోవిందును అభినందించిన మాజీ ఎమ్మెల్సీ అంగర.
గోవిందును సత్కరిస్తున్న మాజీ ఎమ్మెల్సీ అంగర