Telugu News Power

రెండో రోజుకు చేరిన దస్తావేజులేఖర్ల పెన్ డౌన్ నిరసన.

తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న లేఖర్లు

పాలకొల్లు: జులై,21( తెలుగు న్యూస్ పవర్. కామ్)
రాష్ట్రవ్యాప్తంగా దస్తవేజులేఖర్లు చేపట్టిన పెన్ డౌన్ నిరసన కార్యక్రమం మంగళవారం రెండో రోజుకు చేరింది. ప్రభుత్వం ప్రతిపాదించిన జీవో నెంబర్ 396 తక్షణ రద్దు కోరుతూ ఆందోళనకు దిగారు. గతంలో దస్తావేజు లేఖర్లకు లైసెన్సులు ఉండేవని, వాటిని పునరుద్ధరించాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. ఇందువల్ల వారి వృత్తి కొనసాగించుకోవడానికి రక్షణ ఏర్పడుతుందని తెలిపారు. ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తుల చేతికి రిజిస్ట్రేషన్ శాఖను అప్పగిస్తున్నది వారు ఆరోపించారు. వేలాది కుటుంబాలు ప్రైవేటీకరణ వల్ల తరతరాలుగా వస్తున్న ఉపాధి కోల్పోయి రోడ్డున పడకుండా జీవో 396 ను భేషరతుగా ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక రిజిస్టర్ కార్యాలయం వద్ద నిరసన శిబిరంలో రెండో రోజు కూడా ఏమాత్రం తగ్గకుండా, అధిక సంఖ్యలో లేఖర్లు పాల్గొని నిరసన కార్యక్రమం కొనసాగించారు. ఈ సందర్భంగా స్థానిక తహసిల్దార్ యడ్ల దుర్గాప్రసాద్ కు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అధ్యక్షులు తాళ్లూరు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అందజేసి నిరసన నినాదాలు చేశారు. కార్యదర్శి, కడలి శ్రీనివాస్, కోశాధికారి, అమ్మిరాజు, దేవళ్ళ శివరామకృష్ణ, కపిల కృష్ణ, ఆచంట సత్యనారాయణ, గోటేటి శ్రీనివాస్, గణేష్, కే రవికాంత్, మహిళాలేఖర్లు, తదితరులు పాల్గొన్నారు.