ముంబై: జూలై, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్)
దేశంలోనే అత్యంత కఠినమైన ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించిన కబీర్ ఛిల్లార్, ఇప్పుడు అంతర్జాతీయ వేదికపైనా తన ప్రతిభను చాటుకున్నాడు. ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌లో జూలై 10 నుంచి 19 వరకు జరిగిన 58వ అంతర్జాతీయ రసాయన శాస్త్ర ఒలింపియాడ్ ( ఐ సి హెచ్ ఓ ) 2026లో కబీర్ స్వర్ణ పతకం సాధించాడు.
జేఈఈ మెయిన్ 2026లో 300కు 300 మార్కులతో పర్ఫెక్ట్ స్కోరు సాధించి ఆల్ ఇండియా ఒకటవ ర్యాంక్ కైవసం చేసుకున్న కబీర్, ఆ తర్వాత జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 360కి 329 మార్కులతో జాతీయస్థాయిలో 2 ర్యాంకు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఐఐటీ ముంబైలో లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదవాలన్నది అతని లక్ష్యం.
93 దేశాల నుంచి 363 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ ఒలింపియాడ్‌లో, దేశదాటా ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన భారత్ నలుగురు విద్యార్థులు, నలుగురూ స్వర్ణ పతకాలు సాధించడం ద్వారా చరిత్ర సృష్టించింది. ఇది భారత్ ఐ సి హెచ్ ఓ లో పాల్గొన్న 27వ ఏడాది కావడం విశేషం. దేబదత్తా ప్రియదర్శి, హర్షిత్ సింగ్లా, సందీప్ కూచి, కబీర్ ఛిల్లర్‌లతో కూడిన భారత బృందం ఈ క్లీన్ స్వీప్ సాధించింది. దేశాల ర్యాంకింగ్‌లో చైనా, వియత్నాంతో పాటు భారత్ సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచింది.
ప్రొఫెసర్ సుభాజిత్ బందోపాధ్యాయ ( ఐ ఎస్ ఈ ఆర్, కోల్‌కతా) హెడ్ మెంటర్‌గా, డాక్టర్ ఇంద్రాణి దాస్ సేన్ ( హెచ్ బి సి ఎస్ ఈ ) సభ్యులుగా బృందానికి మార్గనిర్దేశం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ నలుగురు విద్యార్థులను అభినందించారు.
కబీర్ ఛిల్లార్ ప్రయాణం లక్షలాది మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది — విద్యాపరమైన కృషితో పాటు, క్రీడలు, సంగీతం వంటి ఇతర అభిరుచులను కూడా సమతుల్యం చేసుకుంటూ వెళ్లడాన్ని నేర్పుతోంది. ఈ సందర్భంగా కవి దేశ ప్రజల అభినందనలు అందుకుంటున్నారు. పోయేంతరాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నారు.
జేఈఈలో టాపర్ గా నిలిచాడు ఇప్పుడు కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో స్వర్ణం గెలిచాడు. కబీర్ ఛిల్లార్ అద్భుత ప్రతిభ.
స్వర్ణ పథక విజేత కబీర్