పాలకొల్లు: మార్చి, 8(తెలుగు న్యూస్ పేపర్. కామ్) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, స్థానిక త్సవటపల్లి సత్యవతి మెమోరియల్, లైన్స్ క్లబ్ భవనంలో లయన్స్ రీజనల్ మీట్, ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి, రీజియన్ అధ్యక్షురాలు, నందుల రమణి అధ్యక్షత వహించారు. ఈ రీజియన్ లో ఉన్న 13 లయన్స్ క్లబ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, విజయవాడ, కే జి వి సరిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా, ఆర్థికంగా వెనుకబడిన, 147 మందికి, కుట్టు మిషన్లు, ఇస్త్రీ పెట్టెలు, సైకిళ్లు, గ్రైండర్లు వంటి ఉపకారణాలు ఉచితంగా డిసిపి సరిత అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ప్రతినిధులు, డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి,పాపారావు నాయుడు, కొమ్ముల మురళీకృష్ణ, వేపాక ప్రవీణ్ భాను,ఎన్. అన్నపూర్ణ, ముందుల సీతారామారావు, శ్రీరామ్ సురేష్, బొండాడ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో లయన్స్ క్లబ్.
మహిళా దినోత్సవం సందర్భంగా,డిసిపి సరిత సత్కరిస్తున్న లైయన్స్ ప్రతినిధులు