Telugu News Power

మహిళలు మరింత ప్రగతి సాధించాలి.

సైకిల్ ర్యాలీ ప్రారంభిస్తున్న దృశ్యం
మహిళా దినోత్సవ సత్కారం అందుకున్న మహిళా మణులు

పాలకొల్లు: మార్చి,7 (తెలుగు న్యూస్ పవర్.కాం) మహిళలు అన్ని రంగాల్లో మరింత ప్రగతి సాధించి ముందుకు రావాలని, స్థానిక ఛాంబర్స్ కళాశాల అధ్యక్షులు కెవిఆర్ నరసింహారావు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, స్థానిక ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి, ఏపీ ఎన్జీవో అధ్యక్షులు గుడాల హరిబాబు అధ్యక్షత వహించారు. జిల్లా ఎన్జీవో అధ్యక్షులు యు వి పాండురంగారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుత ఆధునిక యుగంలో మహిళలు అన్ని విధాలుగా రాణిస్తున్నారని, బాలికలు సాధికారత కోసం కృషి చేయాలని కోరారు. స్థానిక సీఐ కె రజిని కుమార్ మాట్లాడుతూ, మహిళలు వ్యక్తిగత భద్రతతో, ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఏరియా ఆసుపత్రి, పర్యవేక్షకులు కర్రా జయమాలిని మాట్లాడుతూ, మహిళలు తమ ఆహారపు అలవాట్లలో క్రమశిక్షణ పాటించి, ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. బిజెపి కిసాన్ మోర్చా సభ్యులు అల్లూరి పద్మ వర్మ, మహిళలు పాలించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో, కళాశాల కార్యదర్శి, కే వీ సీతారామరాజు, కోశాధికారి, ప్రవీణ్ భాను, ఎం ఉమా, ఉషాసత్య దేవి, డాక్టర్ యర్రా మాధురి, బి విజయలక్ష్మి, వై లలిత, శాంతి సురేఖ, ఎన్ గౌతమి, జ్యోతి ని సత్కరించారు. మహిళా సాధికారిక వాస్తవాలు-విరోధ భావాలు అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. సైకిల్ ర్యాలీలో మహిళలు పాల్గొన్నారు. పలువురు ఎన్జీవో నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.