Telugu News Power

యలమంచిలి లో వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ సభ.

వైఎస్ఆర్సిపి పార్టీ జెండా ఆవిష్కరించిన ఎంపీపీ ఇనుకొండ ధనలక్ష్మి రవికుమార్

యలమంచిలి: మార్చి, 12 (తెలుగు న్యూస్ పవర్.కాం) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద ఘనంగా జరిగింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల పరిషత్ అధ్యక్షురాలు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు వినుకొండ ధనలక్ష్మి రవికుమార్ పార్టీ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా, వైఎస్ఆర్ పార్టీ జిందాబాద్, జై జగన్ అంటూ కార్యకర్తలు నాయకులు ఉత్సాహంగా నినాదాలు చేశారు. ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాలకొల్లు నియోజకవర్గ, పార్టీ ఇంచార్జ్ గుడాల గోపి ,మండల అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్ , ఇనుకొండ ధనలక్ష్మి రవికుమార్, సర్పంచ్ లు, ఎంపీటీసీలు లు, ఉపాధ్యక్షులు,గ్రామ అధ్యక్షులు,, అనుబంధ విభాగ కమిటిలు, రాష్ట్ర, జిల్లా, మండల, నాయకులు, అభిమానులు అందరూ పాల్గొని విజయంతం చేసారు. మండల కమిటీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది.