భీమవరం: మార్చి,14(తెలుగు న్యూస్ పవర్. కామ్) రానున్న పదవ తరగతి పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్ వాట్సాప్ ద్వారా పొందటానికి విద్యాశాఖ ఏర్పాటు చేసింది. విద్యార్థులు ఫోన్లో వాట్స్అప్ ఓపెన్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, వాట్సప్ పాలన నెంబర్ 95523 00009 ను, కాంటాక్ట్ నంబర్లలో సేవ్ చేయాలి. ఈ నెంబర్ కు హాయ్ సందేశం పంపాలి. వచ్చే మెను లో విద్యా సేవలు ఆప్షన్ ను ఎంపికను చేయండి.
అక్కడ ఎస్ఎస్సి మార్చి, 2026 హాల్ టికెట్ ను సెలెక్ట్ చేసుకోండి.
ఇక్కడ మీ దరఖాస్తు నమోదు సంఖ్య లేదా పెన్(పిఇఎన్) నెంబర్, అనగా విద్యార్థి గుర్తింపు సంఖ్య మరియు విద్యార్థి పుట్టిన తేదీని ఎంటర్ చేయండి. వెంటనే మీ 10వ తరగతి హాల్ టికెట్ పిడిఎఫ్ రూపంలో వస్తుంది.ఆ పిడిఎఫ్ ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు.
వాట్సప్ ద్వారా పదవ తరగతి హాల్ టికెట్.