Skip to main content

Telugu News Power

వీరవాసరంలో “అన్నదాత మీకోసం”

రైతన్న మీకోసం కార్యక్రమంలో తోట సీతారామలక్ష్మి

వీరవాసరం: మార్చి,18(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాజ్యసభ మాజీ సభ్యులు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి బుధవారం వీరవాసరంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం ద్వారా నేరుగా 20 వేల రూపాయల సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ చేసినట్టు తెలిపారు. ఇంకా ఎవరికైనా జామకాయ ఎడల రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేయించుకోవాలి సూచించారు. ధాన్యం అమ్మిన వెంటనే సొమ్ము జమ చేసినట్టు గుర్తు చేశారు. వీరవాసరం మండలంలో 5,753 మంది ఈ పథకం ద్వారా ప్రయోజనం ఉండాలని వెల్లడించారు. ఈ సభలో ప్రభుత్వ పథకాల సంబంధించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సభలో పలువురు కూటమి నాయకులు రైతులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.