Skip to main content

Telugu News Power

“రైతన్న మీకోసం” పథకం పై ఏఏంసి చైర్మన్ ప్రచారం.

రైతన్న మీ కోసం ప్రచార కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్

పాలకొల్లు: మార్చి, 18(తెలుగు న్యూస్ పవర్.కాం) రైతే రాజుగా చేయాలని, కూటమి ప్రభుత్వం సంకల్పించిందని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోడి విజయభాస్కర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతన్న మీకోసం పథకం ప్రచారంలో భాగంగా, బుధవారం తిల్లపూడి,మట్టపర్రు గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు, అధికారులు, రైతులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ, దళారీ వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా,రైతులకు మేలు చేసే విధంగా కూటమి ప్రభుత్వ ఈ పథకం ఉద్దేశించిందన్నారు. అర్హులైన రైతులందరికీ సంక్షేమ పథకాల అమలు, రైతన్న మీకోసం లో సమర్థవంతంగా అమలు చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షులు రాంబధ్రరాజు, వ్యవసాయ అధికారి, పి మురళీకృష్ణ, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు.