Telugu News Power

చికిత్సకు వాకర్స్ క్లబ్ సాయం

యలమంచిలి: మార్చి, 21 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కాంబోట్లపాలెం కు చెందిన, చామంతికుర్తి సత్యవతి అనే వృద్ధురాలికి వైద్యం నిమిత్తం పాలకొల్లు వాకర్స్ క్లబ్ ఎనిమిది వేల రూపాయల సహాయం శనివారం అందజేసింది. అవసరమైతే ఇంకా సహాయం అందజేయడానికి క్లబ్ వారు ముందుకు వచ్చారు. ఒంటరిగా ఉంటున్న ఈ వృద్ధురాలు ప్రమాదానికి గురికాగా పొరుగువారు ఈమెకు ఆస్పత్రికి తీసుకువెళ్లే వైద్యం చేయించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పీర్ సాహెబ్, మానం బసవరాజు, , బొలిశెట్టి హనుమంతరావు,ఉమాశంకర్, అప్పారి రామారావు తదితరులు పాల్గొన్నారు.