Skip to main content

Telugu News Power

ఎనర్జీ (విద్యుత్) యూనివర్సిటీ ఏర్పాటు చేయండి- సీఎం ఆదేశాలు.

విద్యుత్ అధికారులకు ఆదేశాలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

అమరావతి: మార్చి, (తెలుగు న్యూస్ పవర్. కామ్) విద్యుత్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా టెక్నాలజీని అందుపుచ్చుకునేందుకు ఎనర్జీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని అధికారులను మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర దేశాల్లో ఈ రంగంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఎప్పటికప్పుడు అధ్యాయనం చేయాలని కోరారు. విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు నూతన ఆవిష్కరణల కోసం స్టార్ట్ అప్ కంపెనీలకు అవసరమైన మార్జిన్ మనీ సమకూర్చేలా విద్యుత్ శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు ఇంకుబేషన్ నిధి ఏర్పాటు చేసి, స్టార్ట్ ప్ కంపెనీలకు చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.