Telugu News Power

వాకర్స్ క్లబ్ సహాయం.

విద్యార్థులకు వాకర్స్ క్లబ్ సైకిళ్ళ పంపిణీ

పాలకొల్లు: మార్చి, 25 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక వాకర్స్ క్లబ్, ఇద్దరు పేద విద్యార్థులకు బుధవారం, కొత్త కుళాయి చెరువు వద్ద, అధ్యక్షులు తటవర్తి సుధాకర్ రావు సైకిళ్ళు పంపిణీ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామరాజు లంక గ్రామం, ఉర్రింక మధు వర్షిని, నాగులంక గ్రామం, మండపాక సిద్దు దూరంగా ఉన్న పాఠశాలకు వెళ్లడానికి, 14 వేల రూపాయలతో ఈ సహాయం అందజేశారు. బట్టీలంక కు చెందిన ఇంటర్ విద్యార్థి బి.హాసినికి వైద్య ఖర్చుల నిమిత్తం 7 వేల రూపాయల మందులు అందించారు. ఈ కార్యక్రమంలో, షేక్ వీర్ సాహెబ్, కటారి నాగేంద్ర కుమార్, సలాది రామచంద్ర రావు, చామా శ్రీనివాసరావు,పి. ఉమా శంకర్, ధనాని శ్రీరామ్మూర్తి, జవ్వాజి కళ్యాణ్, బోనం రాజు, మానెం బసవరాజు, తదితరులు పాల్గొన్నారు.