
ఫ్లోరిడా: ఏప్రిల్, 1(తెలుగు న్యూస్ పవర్. కామ్)అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ,నాసాచేపట్టిన ఆర్టెమిస్-II ప్రయోగం విజయవంతంగా ప్రారంభమై, మానవ అంతరిక్ష చరిత్రలో మరో కీలక మైలురాయిగా నిలిచింది. ఆర్టెమిస్-II ప్రయోగం
అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి 2026 ఏప్రిల్ 1న సాయంత్రం నాసా అత్యాధునిక అంతరిక్ష యానం వ్యవస్థ, (ఎస్ ఎల్ ఎస్) రాకెట్ ద్వారా ఆర్టెమిస్-II మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించింది. నాసా ప్లస్ వన్
ఈ మిషన్ ద్వారా నలుగురు వ్యోమగాములు ఓరియన్ అంతరిక్ష నౌక లో చంద్రుడి చుట్టూ ప్రయాణం చేయనున్నారు. ఇది దాదాపు 50 సంవత్సరాల తరువాత మానవులు చంద్రుని వైపు సాగుతున్న తొలి మిషన్‌గా చరిత్రలో సృష్టించింది.
వ్యోమగాముల బృందం
ఈ మిషన్‌లో పాల్గొంటున్న నలుగురు వ్యోమగాములు:
రీడ్ వైజ్‌మన్ (కమాండర్)
విక్టర్ గ్లోవర్ (పైలెట్)
క్రిస్టినా కోచ్ (మిషన్ నిపుణురాలు)
జెరెమీ హాన్సన్ (కెనడా వ్యోమగామి)
ఈ మిషన్‌లో ప్రత్యేకతలు,
చంద్రుడి చుట్టూ ప్రయాణించే తొలి మహిళగా క్రిస్టినా కోచ్ నిలవనుంది
తొలి ఆఫ్రో-అమెరికన్ వ్యోమగామిగా విక్టర్ గ్లోవర్ చరిత్ర సృష్టిస్తున్నారు. మిషన్ నిర్దేశించుకున్న లక్ష్యాలు,
ఆర్టెమిస్-II మిషన్ ప్రధానంగా పరీక్షా ప్రయోగం,చంద్రుడి చుట్టూ 10 రోజుల ప్రయాణం,
జీవన సహాయక వ్యవస్థల (లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్స్) పరీక్ష,
భవిష్యత్తు చంద్రయానాల కోసం సాంకేతికత ధృవీకరణ ముఖ్యమైనవి.
ఈ మిషన్‌లో వ్యోమగాములు చంద్రుడిపై దిగరు. కానీ చంద్రుని చుట్టూ తిరిగి భూమికి చేరుకుంటారు.
ఆర్టెమిస్ ప్రోగ్రామ్ ప్రాముఖ్యత
నాసా చేపట్టిన ఆర్టమిస్ కార్యక్రమం వల్ల,
మళ్లీ చంద్రుడిపై మానవుల అడుగులు పెట్టించడం
2027-28 నాటికి చంద్రుడిపై స్థిర స్థావరం ఏర్పాటు
భవిష్యత్తులో మంగళగ్రహ యాత్రలకు పునాది వేయడం లక్ష్యం.ఆర్టెమిస్-II విజయవంతం అయితే, తదుపరి ఆర్ట్మిస్ III మిషన్‌లో చంద్రుడిపై మానవులను దింపే ప్రణాళిక ఉంది. చరిత్రలో కొత్త అధ్యాయం
ఆర్టెమిస్-II ప్రయోగం, 1972లో జరిగిన అపోలో మిషన్‌ల తరువాత మానవులను చంద్రుడి వైపు మళ్లీ పంపిన తొలి ప్రయత్నం. ఇది అంతరిక్ష పరిశోధనలో కొత్త యుగానికి నాంది పలుకుతోంది.
ఆర్టెమిస్-II మిషన్ విజయవంతంగా ప్రారంభం కావడం ప్రపంచానికి గొప్ప సాంకేతిక విజయం. భవిష్యత్తులో చంద్రుడు, మంగళగ్రహం వంటి గ్రహాలపై మానవ జీవనం సాధ్యమయ్యే దిశగా ఇది కీలక అడుగు అని నిపుణులు భావిస్తున్నారు.
