Skip to main content

Telugu News Power

నేటి నుంచి పంచాయతీల లో ప్రత్యేక అధికారుల పాలన.

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీలు శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలనలో కి వస్తుంది. ఇంతవరకు సాగిన సర్పంచ్ ల పాలన గురువారంతో
ముగిసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం జి ఓ ఎం ఎస్ నెం.47 విడుదల చేసింది. ప్రభుత్వం ఇంతకుముందే చెక్కు పవర్ వద్దు ఉత్తర్వులు వెలువరించింది. ప్రత్యేక అధికారుల పాలన ప్రజలకు అందుబాటులో ఉండటం సమస్య కావచ్చునని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక అధికారులుగా ఎంపీడీవో, ఎమ్మార్వో, వ్యవసాయ అధికారి, పశువైద్యాధికారి, విద్యాశాఖ అధికారీ ఆయా మండలాల్లో ఉన్నవారికి అప్పగిస్తారు. జిల్లా కలెక్టర్లు ఈ నియామకాలు చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఓకే అధికారికి పలుచోట్ల ప్రత్యేక అధికారి బాధ్యతలు అప్పగించినట్లు ఉత్తరువులను బట్టి తెలుస్తోంది. ఎన్నికలు జరిగే వరకు ఈ ప్రత్యేక పరిస్థితులు ప్రజలు భరించక తప్పని పరిస్థితి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి ఇంతవరకు ప్రభుత్వం ఏ ప్రకటన చేయలేదు.