అమరావతి: ఏప్రిల్,2(తెలుగు న్యూస్.కాం) ఫ్యాప్టో చైర్మన్ ఎల్. సాయి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ నోటీసు అందజేయడానికి గురువారం సచివాలయానికి నాయకులు చేరుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను ఈ సందర్భంగా, కలుసుకొని 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే నియమించాలని కోరారు. ఈ నెల 10 లోపు 6వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుముఖత వ్యక్తం చేసినట్టు వెల్లడించారు. సెక్రటరీ జనరల్, ఎస్ చిరంజీవి, తదితర ఫ్యాక్టో నాయకులు కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
6 వేల కోట్ల బకాయిలు విడుదలకు ముఖ్య మంత్రి అంగీకారం.
ఫ్యాప్టో చైర్మన్ ఎల్ సాయి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సచివాలయం చేరుకున్న నాయకులు