
అమరావతి: ఏప్రిల్,2(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి పెద్దల సభలో ఆమోదం లభించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. వాడ వాడల పిల్లాపాపలతో ఈ సంబరాలు జరుపుకున్నారు. కూటమి నాయకులు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద రాజధాని సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఇందుకోసం పుష్కరకాలం అని చికి నెలకొని ఉంది. అమరావతి శాశ్వత ప్రజారాజధానిగా, రైతుల త్యాగాల కోసం ఆంధ్రప్రదేశ్ గర్వకారణమైన నిలిచింది. సుమారు29వేల మంది రైతులు 34వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చి నిర్మించిన రాజధాని అమరావతి. ఇది కేవలం రాజధాని కాదు, ఇది ఒక విశ్వాసం, ఒక త్యాగం,ఒక సామాజిక బాధ్యత. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ తీవ్ర అన్యాయాన్ని ఎదుర్కొంది. అయినప్పటికీ ప్రజలు రాజ్యాంగబద్ధంగా అంగీకరించారు. ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపనతో ప్రారంభమైన అమరావతి, దేశంలోనే “ప్రజల రాజధాని”గా నిలవాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.రైతుల త్యాగం వృథా కారాదని. వారు16 వందల రోజులపాటు చేసిన పోరాటం ప్రజాస్వామ్యానికి. ప్రతీక.
ఆంధ్రప్రదేశ్ సవరణ చట్టం 2014 ప్రకారం రాజధాని అంశం పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. అందుకే కేంద్రం మద్దతుతో అమరావతి శాశ్వత రాజధానిగా కొనసాగాల ప్రజల ఆకాంక్ష.
గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం పూర్తిగా అసంబద్దమైనది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భారీగా నిధులు కేటాయించింది. సి ఆర్ డి ఏ రూ.1500 కోట్లు, రింగ్ రోడ్ ప్రాజెక్ట్‌కు రూ.20,000 కోట్లు
హడ్కో ద్వారా రూ.11,400 కోట్లు,వరల్డ్ బ్యాంక్ సహకారంతో రూ.15,000 కోట్లునిధులు అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు బలమైన పునాది వేశాయి.
అమరావతి నినాదం కాదు. ఇది ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే పరీక్ష.ఉద్దండరాయునిపాలెంలో రైతులతో కలిసి సతీసమేతంగా అమరావతి సంబరాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ సందర్బంగా రైతులను ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి. అనంతరం రాజధానికి శంకుస్థాపన జరిగిన పవిత్ర స్థలాన్ని సందర్శించి పూజలు నిర్వహించి దీప హారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు దంపతులు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, నారాయణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, ఎమ్మెల్యేలు, రైతులు పాల్గొన్నారు.
