
భీమవరం: ఏప్రిల్, 2(తెలుగు న్యూస్ పవర్. కం) స్థానిక జిల్లా కేంద్రంలో అల్లూరి సీతారామరాజు స్మృతి కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆధ్వర్యంలో అమరావతి శాశ్వత రాజధాని ఇంకా చట్టం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆధులకు గర్వకారణం అన్నారు. ఈ సందర్భంగా గురువారం జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా అధికారులు రాహుల్ కుమార్ రెడ్డి, నయీమ్ హష్మీ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ వారి సూచనలు అనుసరించి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో సాయంత్రం ఆలయం ప్రాంగణంలో జై అమరావతి మన రాజధాని -మన విజయం” చారిత్రాత్మక రాజధాని తీర్మానం- మన అమరావతి ” ముగ్గులు వేసి ఆ ముగ్గుల వద్ద దీపపు జ్యోతులను వెలిగించారు
దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ , జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ హరి సూర్యప్రకాష్, ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం, ధర్మకర్తలమండలి సభ్యులు, సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు.
పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో చైర్మన్ మీసాల రామచంద్ర రావు అమరావతి అఖండ జ్యోతి ప్రజ్వలన చేసి, జి అమరావతి నినాదాలు చేశారు.
శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాల్టీ రాజరాజేశ్వరి ఆధ్వర్యంలో, అధ్యాపకులు, విద్యార్థులు అమరావతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.
