Telugu News Power

లొల్ల లాకుల లొల్లికి చెల్లు, 16 మండలాల రైతులకు వరం.

జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు కు కృతజ్ఞతలు తెలుపుతున్న ఎమ్మెల్యే బండారు

అమరావతి/కొత్తపేట: ఏప్రిల్, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్) కోనసీమ రైతుల చిరకాల వాంఛ తీరబోతున్నట్టు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శుక్రవారం తెలిపారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న,కోనసీమ రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. లొల్ల లాకుల ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. సుమారు రూ.74.20 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ ప్రాంత అభివృద్ధికి దిశా నిర్దేశం చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకుడు నారా లోకేష్ కు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కృతజ్ఞతలు తెలిపారు. నిధుల మంజూరుకు విశేష కృషి చేసిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును వారి చాంబర్లో స్వయంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.
నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుండి లొల్ల లాకుల ఆధునీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు బండారు తెలిపారు. కూటమిప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు సాకారమవుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఈ పనుల ద్వారా రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అమలాపురం – బొబ్బర్లంక రోడ్డులో లొల్ల లాకుల సమీపంలో వంతెన నిర్మిస్తారు. అమలాపురం పార్లమెంట్ పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 16 మండలాల రైతులకు ఇది ఎంతో మేలు చేస్తుందని ఎమ్మెల్యే వెల్లడించారు.