Skip to main content

Telugu News Power

రెండు రైళ్లు నిరంతర ప్రయాణం.

న్యూఢిల్లీ/నరసాపురం: ఏప్రిల్, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్)
నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. సికింద్రాబాద్- అనకాపల్లి (17043/44) మరియు నరసాపురం – తిరుపతి (17427/28) స్పెషల్ రైళ్లను రోజువారి రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మారుస్తూ ఉత్తర్వులు రైల్వే శాఖ విడుదల చేసింది.
దీనివల్ల ప్రయాణికులకు
తక్కువ ధరకే టికెట్లు అందుబాటు ఉంటాయి.
ముందస్తు రిజర్వేషన్ మరియు ఖచ్చితమైన ప్రయాణ ప్రణాళికతో ప్రయాణికులకు సౌకర్యం కలుగుతుంది.మెరుగైన ప్రయాణ సదుపాయాలు ఉంటాయి.నిరంతర రైలు సదుపాయం కల్పించినందుకు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర రైల్వే శాఖకు స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ధన్యవాదాలు తెలియజేశారు.