Skip to main content

Telugu News Power

యువత జగ్జీవన్ రామ్ స్ఫూర్తిగా తీసుకోవాలి. -కలెక్టర్ నాగరాణి

బాబు జగ్జీవన్ రామ్ కు నివాళులర్పిస్తున్న కలెక్టర్ నాగరాణి

భీమవరం: ఏప్రిల్, 5(తెలుగు న్యూస్ పవర్. కామ్)బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, మహానేత బాబు జగ్జీవన్ రామ్ అని కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. కేంద్ర మాజీమంత్రి జగ్జీవన్ రామ్ 119వ సందర్భంగా, కలెక్టరేట్ వద్ద జరిగిన జయంతి వేడుకల్లో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ, కులరహిత సమాజ నిర్మాణానికి, జీవితాంతం కృషి చేసిన గొప్పనేత బాబు జగ్జీవన్ రామ్ ను కలెక్టర్ కొనియాడారు. ముఖ్య అతిథిగా పాల్గొని,ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సమానత్వం, సామాజిక న్యాయం, దళితుల హక్కుల పరిరక్షణలో ఆయన చేసిన సేవలు అనితర సాధ్యయమైనవని ప్రశంసించారు. పేద ప్రజల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి మరువలేనిది అన్నారు. యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని విద్య, విశ్లేషణాత్మక దృక్పథంతో సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.