Telugu News Power

మంత్రి నిమ్మల ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

గాంధీ బొమ్మల సెంటర్ వద్ద బాబు జగ్జీవన్ రామ్ కు నివాళులర్పిస్తున్న మంత్రి నిమ్మల, అంగర
రక్తదాన శిబిరంలో దాతలను అభినందిస్తున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు: ఏప్రిల్, 5(తెలుగు న్యూస్ పవర్. కామ్) బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కేంద్ర మాజీ మంత్రి బాబు జగ్జీవన్ రామ్ 119 వ జయంతి వేడుకలు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుకున్న శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా, ధర్మారావు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 110వ రక్తదాన శిబిరం నిర్వహించారు. పేద మహిళలకు చీరల వస్త్ర దానం చేశారు. రక్తదానం చేసిన యువకులను మంత్రి అభినందించారు. స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్ద గల బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి మంత్రి కూటమి నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. స్థానిక ఎమ్మార్వో కార్యాలయం వద్ద గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. స్థానిక తహసిల్దార్ జరిగిన ప్రధాన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రామ మోహన్ రావు, ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, స్థానిక సీఐ కోలా రజిని కుమార్, ఉన్నమట్ల కపర్ది, పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, పొట్లూరి శ్రీనివాస్,కర్నేని గౌర్నాయుడు, జక్కంపూడి కుమార్, పసుపులేటి రాజేష్ కన్నా, చినబాబు, పీతల శ్రీనివాస్, ఉందుర్తి సురేష్, వెంకట్, కొండేటి సురేష్, వట్టం గణేష్, జేమ్స్, కడలి గోపి, ధనాని సూర్య ప్రకాష్ ,శ్రీరామ్మూర్తి, వరద శేషు జీవరత్నం, మామిడిశెట్టి పెద్దిరాజు, బిట్ట లక్ష్మీనారాయణ, చిన్నమిల్లి గణపతి రావు, సిడగం సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.