అంతరిక్షం: ఏప్రిల్, 7(తెలుగు న్యూస్ పవర్. కామ్) అమెరికా,నాసా చేపట్టిన ఆ అర్థమిస్-II నిన్ను ప్రత్యేకతలు తన సొంతం చేసుకుంటున్నది. సుదీర్ఘ విరామం తర్వాత ఆర్థమిస్ ద్వారా చంద్రయానం పునః ప్రారంభమైంది.
నాసా ఆర్టెమిస్ కార్యక్రమంలో పాల్గొన్న అంతరిక్ష బృందం చంద్రుడు వెనుక నుంచి మొదటిసారిగా పూర్తి సూర్యగ్రహణాన్ని చూశారు. ఇది మానవులు ఎప్పటికీ చూడని అద్భుత, అపురూప దృశ్యం. చంద్ర కక్ష్యలో ఉండగా, చంద్రుడు ముందు ఉన్న సూర్య కిరణాల చుట్టూ వ్యాపించిన సూర్య కిరీటం (సోలార్ కరోనా) అద్భుతంగా కనిపించింది.
ఈ అపూరు దృశ్యం చూడకముందే, ఆ బృందం ‘అర్థ్‌సెట్’ సూర్య అస్తమయ, సూర్యోదయ దృశ్యాలను ఆస్వాదించారు. చంద్రుడి దూరవైపు ప్రదేశాలను ఫోటోల్లో బంధించారు. వాటిలో కొన్ని మానవులు ఎప్పటికీ చూడని ప్రదేశాలు.
అంతరిక్షంలో ఈ సూర్యగ్రహణం కేవలం ఆ బృందం స్థానం నుంచి మాత్రమే కనిపించింది. అయితే, ప్రథ్విపై రెండు సంవత్సరాల్లో మూడు పూర్తి సూర్యగ్రహణాలు కనిపించబోతున్నాయి. ఇలాంటివి ప్రతి 18 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి.
ఈ చారిత్రక ఘటన ఆర్టెమిస్ కార్యక్రమం యొక్క విజయాన్ని మరింత ప్రస్ఫుటం చేస్తోంది. త్వరలో చంద్రుడిపై మానవుల స్థిరనివాసం కోసం మరిన్ని మైలురాళ్లు ఆశిస్తున్నామని నాసా వెల్లడించింది.
చంద్రుడు వెనుక నుంచి సూర్యగ్రహణం: ఆర్టెమిస్-II బృందం చూసిన దృశ్యం.
సూర్య గ్రహణం సందర్భంగా ఏర్పడిన అంగుళీకం (సోలార్ కరోనా)