Skip to main content

Telugu News Power

పరారీలో స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల వీడియో సందేశంలో క్షమాపణలు

హైదరాబాద్: ఏప్రిల్, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్టాండ్ అప్ కమెడియన్ కటికాల అనుదీప్ ఇటీవల తన షోల్లో ప్రముఖుల వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ చేస్తున్న హాస్యం ప్రదర్శనలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వివిధ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అవుతున్నాయి. సోమాజిగూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్ వంటి చోట్ల కామెడీ క్లబ్ లో అనుదీప్ ప్రదర్శనలు ఇస్తుంటాడు. ఈ ప్రదర్శనలో, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, నిహారికల వ్యక్తిగత జీవితాన్ని కించపరుస్తూ మాట్లాడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో ఓ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచి పై కట్టమైన చర్యలు తీసుకోవాలని వీధి పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతున్నారు. అనుదీప్ సంప్రదించడానికి ప్రయత్నించగా అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని అభిమానులు చెబుతున్నారు.

తెలుగు స్టాండప్ కామెడీ రంగంలో తీవ్ర దుమారం రేగుతోంది. కామెడీ పేరుతో హద్దులు దాటిన అనుదీప్ కటికాల ప్రస్తుతం అడ్రస్ లేకుండా పోయారు.

సోమాజిగూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్ వంటి ప్రధాన ఏరియాల్లోని కామెడీ క్లబ్‌లలో ప్రదర్శనలు ఇచ్చే అనుదీప్, ఇటీవల తన పర్ఫార్మెన్స్‌లో ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై అత్యంత నీచమైన మరియు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ వ్యాఖ్యలపై అటు నందమూరి బాలకృష్ణ, ఇటు పవన్ కళ్యాణ్, మరియు నారా లోకేష్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో అనుదీప్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇతని ప్రదర్శనలు ఇప్పటికే కామెడీ క్లబ్ లు రద్దు చేసినట్టు ప్రకటించాయి. ఆదివారం క్షమాపణ కోరుతూ ఒక వీడియోస్ సందేశా న్ని సోషల్ మీడియాలో విడుదల చేశారు. ప్రదర్శనల్లో ఆరోగ్యకరమైన హాస్యం పండించాలి గాని వ్యక్తుల జీవితాన్ని అపహాస్యం పాలు చేయడానికి ప్రయత్నించడం గర్హనీయమని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.