Telugu News Power

శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో లీలా కళ్యాణమ్.

లీలా కళ్యాణం సందర్భంగా మాడవీధులలో ఊరేగింపు

పాలకొల్లు: ఏప్రిల్, 15(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానములో బుధవారం మాస శివరాత్రి సందర్భంగా, దంపతులు రుద్ర హోమం పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ రుద్ర హోమం పూజలు అభిషేక పండితులు భమిడిపాటి వెంకన్న, ఆలయ ప్రధాన అర్చకులు కిష్టప్ప, పవన్ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, సూపర్నెంట్ వాసు పాల్గొన్నారు. లీలా కళ్యాణం సందర్భంగా, స్వామి వారు దేవేరులను మాడవీధులలో నేత్రపర్వంగా ఉరేగించి భక్తులకు అనుగ్రహ దర్శనం చేయించారు. అనంతరం లీలా కళ్యాణం జరిపించారు. పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.