Telugu News Power

కొత్త పెళ్లి కొడుక్కి కత్తిపోట్లు

ఆసుపత్రిలో చికిత్సపాందుతున్న వరుడు సాయి
కొత్త దంపతులు సాయి, శ్రీ దుర్గా

పాలకొల్లు: ఏప్రిల్, 15(తెలుగు న్యూస్ పవర్. కామ్) నర్సాపురం పట్టణం, వలందర్ రేవు సమీపంలో ఉన్న దేవాలయం ఓ ప్రేమ జంట ఆదివారం వివాహం చేసుకున్నారు. కొత్త దంపతులు పాలకొల్లుకు చెందిన చందక సాయికుమార్, గుడిమెట్ల శ్రీ దుర్గ. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నూతన వధూవరులు, మంగళవారం రాత్రి రిసెప్షన్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు కొత్త జంటకు అభినందనలు తెలుపుతున్నారు. అందరిలాగే, గోగులమండ శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా వేదిక వద్దకు వచ్చాడు. పెళ్ళికొడుకు భుజం పై చేయి వేసి, అభినందనలు తెలియజేస్తున్నట్టు నటిస్తూ, అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో పెళ్ళికొడుకు పోయి దాడి చేశాడు. వెంటనే అక్కడ ఉన్న మిగిలిన అథిధులు నిందితుడిని వేదిక వద్ద నుంచి నెట్టి వేశారు. కత్తిపోట్లకు గురైన బాధితున్ని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్చారు. వరుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రిసెప్షన్ కు హాజరైన బంధుమిత్రులు ఊపిరి పీల్చుకున్నారు. బాధితుడు, నిందితుడు ఇద్దరు పక్కపక్కనే నివాసం ఉంటారు. కేసు నమోదు చేసిన పోలీసులు,ఈ దాడికి కారణాల పై విచారణ చేపట్టారు.