Skip to main content

Telugu News Power

ఉపాధ్యాయులపై కేసు కొట్టివేత.

కోర్టు కేసు కొట్టు వేయడంతో వర్షం వ్యక్తం చేస్తున్న యుటిఎఫ్ నాయకులు

విజయవాడ: ఏప్రిల్, 28(తెలుగు న్యూస్ పవర్. కామ్) చలో ముఖ్యమంత్రి కార్యాలయం పిలుపు మేరకు యుటిఎఫ్ రాష్ట్ర సంఘం2022, ఏప్రిల్ 25న చేపట్టిన ఛలో సిఎంఓ కేసు మంగళవారం నా ఇస్తాను కొట్టి వేసింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న 65మంది యు.టి.యఫ్. నాయకులు, కార్యకర్తలపై పోలీసులు పెట్టిన అక్రమ కేసు సుమారు 4 ఏళ్లుగా నడచింది.ఈ కేసు అక్రమమని ప్రభుత్వం గుర్తించి, కేసు ఉపసంహారించుకున్న నేపథ్యంలో యుటిఎఫ్ నాయకులు, కార్యకర్తలపై ఉన్న కేసును రద్దు చేస్తున్నట్లు విజయవాడ మూడవ అడిషనల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ప్రకటించారు.సిపిఎస్ రద్దు కోరుతూ 2022 నుండి యుటియఫ్ అనేక ఉద్యమాలు నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ ఉద్యమాల్లో పాల్గొన్న ఉపాధ్యాయులు, ఉద్యోగులపై గత రాష్ట్ర ప్రభుత్వం అనేక కేసులు బనాయించింది.
అయినప్పటికీ, యుటియఫ్ సభ్యులు, కార్యకర్తలు వెనకడుగు వేయకుండా నిర్భయంగా అనేక పోరాటాలు సాగించారు. ఇప్పటికే చాలా జిల్లాలలో కేసులు కొట్టివేయడం జరిగింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో పెట్టిన కేసును ఉపసంహరించుకున్నట్లు కోర్టుకు తెలపడంతో కోర్టు కేసును రద్దు చేసింది. కేసును కోర్టు రద్దు చేయడం పట్ల యుటియఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు హర్షం వ్యక్తం చేసారు. ఈ తీర్పు ఉద్యమాలకు ఊపిరి పోసిందని, ఈ విజయం ప్రజాస్వామిక విజయమని పేర్కొంటూ నిర్బంధాలకు, కేసులకు సైతం వెరవకుండా సంఘ పిలుపుకు స్పందించి ఉద్యమించిన కార్యకర్తలకు, ఉపాధ్యాయులకు అందరికీ ఈ విజయాన్ని అంకితమిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా కోర్టుకు యుటియఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.ఎస్.ఎస్. ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శులు జీ.వి రమణ, ఎస్.పి.మనోహర్ కుమార్, తిరుపతి జిల్లా పూర్వ జిల్లా కార్యదర్శి ఓ.విజయకుమార్, ఎన్‌టిఆర్ జిల్లా ప్రధానకార్యదర్శి ఏ.సుందరయ్య, అడ్వకేట్‌లు సుస్మిత, దుర్గేష్ హాజరయ్యారు.