పాలకొల్లు: ఏప్రిల్,28(తెలుగు న్యూస్. కామ్) సాధారణంగా ఎన్నికల హామీలు నీటి మూటలుగా మిగులుతాయి. కానీ అది స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు విషయంలో మాత్రం శాసనంగా అమలవుతుంది. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల పర్యటనలో గూగుల్ పెద్దింట్లకు ఇచ్చిన మాట మంత్రి నిలబెట్టుకున్నారు. స్థానిక బ్రాడీపేట రెండో వీధిలో శిథిలావస్థలో ఉన్న ఆమె ఇంటిని చూసి, మంత్రి చెలించి పోయారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు ప్రస్తుతం ఇంటి నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల ఆ పేదరాలి ఇంటి నిర్మాణానికి శ్రమదానం చేసి తల పెద్ద మనసు చాటుకున్నారు. ఈ గృహానికి ప్రభుత్వం రుణంతో పాటు, తాను కూడా తగిన సహాయం చేస్తానని భరోసా ఇచ్చారు. దీంతో పెద్దింట్లు కుటుంబ సభ్యులు మంత్రి ఔదార్యం పట్ల కృతజ్ఞత తో కంటతడి పెట్టారు.
మాట నిలబెట్టుకున్న మంత్రి నిమ్మల.
శ్రమదానం చేస్తున్న మంత్రి నిమ్మల