Telugu News Power

యమంచిలిలో మేడే వేడుకలు

మే డే వేడుకల్లో పాల్గొన్న సిఐటియు, యూటిఎఫ్ నాయకులు

యలమంచిలి: మే,1(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ కార్మిక దినోత్సవం, మే డే సందర్భంగా యూటీఎఫ్, సిఐటియు యలమంచిలి మండల శాఖల ఆధ్వర్యంలో మండల కేంద్రం వద్ద యుటిఎఫ్, సిఐటియు పతాకావిష్కరణల కార్యక్రమం శుక్రవారం జరిగింది.
ఈ కార్యక్రమానికి యుటిఎఫ్ యలమంచిలి మండలాధ్యక్షులు గుత్తిందీవి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన యుటిఎఫ్ పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతికుమార్ మేడే సందర్భంగా, యుటిఎఫ్ పతాకాన్ని, సిఐటియు పతాకాన్ని మండల అధ్యక్షురాలు కె. శ్రీ వర్ధిణి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పి క్రాంతి కుమార్ మాట్లాడుతూ, 140 సంవత్సరాల క్రీతం అమెరికాలో చికాగో నగరంలో జరిగిన కార్మిక హక్కుల రక్షణ ఉద్యమం ఇప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.ప్రస్తుత సమకాలీన పరిస్థితులలో కార్మిక చట్టాలను రద్దు చేయడం, కనీస వేతనాలను అమలు చేయకపోవడం, పని గంటల భారాన్ని పెంచడం, లేబర్ కోడ్ల ద్వారా కార్మిక హక్కుల రద్దు చర్యలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలకు గొడ్డలిపెట్టన్నారు. ఈ దుర్మార్గమైన లేబర్ కోట్ల రద్దు కోసం ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
పెన్షన్ను రద్దు చేయడం, మినిమం టైమ్ స్కేల్ పేరుతో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పేరుతో ఉద్యోగుల వేతనాల్లో, హక్కుల్లో కోతలు విధించడం, ఫిక్సెడ్ టెర్మ్ ఎంప్లాయ్మెంట్ను తీసుకురావడం హైర్ అండ్ ఫైర్ విధానాలను అమలు చేయడం అమానుషమైన చర్యలన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మికులు ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు దేవ సుధాకర్ కే శ్రీ వర్ధిణి , యుటిఎఫ్ మండల శాఖ జిల్లా కౌన్సిలర్స్ రామేశ్వరపు సత్యనారాయణ, అడబాల వెంకటేశ్వరరావు,మండల శాఖ ఆఫీస్ బేరర్స్ పెచ్చెట్టి నాగ శ్రీనివాస్, పిండి రామచంద్రరావు, జే ఆర్ వి నాగేశ్వరరావు, ఎం బాపిరాజు, ఎం రాంబాబు, వి రవిచంద్ర, బొప్పన శ్రీనివాస్, కనగర్ల సుబ్బారావు, అంగన్వాడీ సిబ్బంది మరియు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.