ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ తన అధికారిక కాన్వాయ్‌ను వదిలి దిల్లీ మెట్రోలో శనివారం ప్రయాణించారు. ఈ సందర్భంగా, వర్మ మాట్లాడుతూ,
మనం ఆదా చేసే ప్రతి లీటర్ పెట్రోల్, డీజిల్ — భారతదేశానికి ఆదా చేసిన విదేశీ మారక ద్రవ్యం లోటు భర్తీ చేస్తుందన్నారు.
మెట్రోలో ప్రయాణించే ప్రతి కిలోమీటర్ — మన ఆర్థిక వ్యవస్థకు బలం, మన పర్యావరణానికి రక్షణ గా ఉంటుందన్నారు.
ప్రతి భారతీయుడు — ఈ జాతీయ సంకల్పంలో భాగస్వాములు కావాలని కోరారు. మెట్రో ఎక్కండి. బస్సు ఉపయోగించండి. పొరుగువారితో కార్‌పూల్ చేయండి. వీలైనప్పుడు ఇంటి నుంచే పని చేయండని విజ్ఞప్తి చేశారు. దేశంలో140 కోట్ల
భారతీయుల చిన్న అడుగులే మోదీజీ కలలుగన్న ఆత్మనిర్భర భారత్‌కు పెద్ద పునాది అవుతా యన్నారు.
ప్రధాని పిలుపుమేర కు కేంద్రమంత్రి వర్మ మెట్రోలో ప్రయాణం.
మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ