Telugu News Power

ఈ నెల 31 నుంచి కాలువలకు నీళ్లు, గడువులోగా పనులు ముగించాలి. -రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల ఆదేశాలు.

జలవనరుల శాఖ ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు: మే, 23 (తెలుగు న్యూస్ పవర్. కామ్) మే నెలాఖకు పంట కాలువలకు నీరు విడుదల చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు వెల్లడించారు. మంత్రి తన క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ ఇంజనీర్లతో జిల్లా సాగునీటి వ్యవస్థ పై సమగ్రంగా శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, వంట కాల్వల పనులు గడువుకు ముందే పూర్తి అయ్యేలా వేగం పెంచాలని సూచించారు. జలవనరుల శాఖకు సంబంధించి జిల్లాలో 492 పనులకు గాను 20041 పనులు పురోగతిలో ఉన్నాయని, ఇందుకు రూ. 27.34 కోట్ల నిధులు మంజూరైనట్టు ఇరిగేషన్ శాఖ అధికారులు మంత్రికి వివరించారు. గత ప్రభుత్వం కాల్వ నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల రైతులు దెబ్బతిన్నారని మంత్రి గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో అలాంటి పరిస్థితులు ఎదురవకుండా చిట్టచివరి ఎకరం వరకు నీరు అందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. కాలువల్లో పూడిక తీత, రిపేరు పనులు, గుర్రపుక్క డెక్క, తూడు తొలగింపు వంటి పనులు తక్షణమే పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. గోదావరి డెల్టా సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఇందుకుగాను రూ.14 కోట్లతో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసినట్టు మంత్రి వెల్లడించారు. లైడార్ సర్వే పూర్తయినట్టు మంత్రి తెలిపారు. వచ్చే రెండేళ్లలో ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. ఈ సమావేశానికి
ఎస్ ఈ దేవ ప్రకాష్, ఈ ఈ రమేష్, డి ఈ వెంకట నారాయణ నారాయణ, ధర్మ జ్యోతి ఏఈ లు పాల్గొన్నారు.