Skip to main content

Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ వారికి బంగారు కానుక.

శ్రీ మావుళ్ళమ్మ వారికి ఇర్రింకి వారు సమర్పిస్తున్న బంగారు కానుక దృశ్యం

భీమవరం: మే, 23 (తెలుగు న్యూస్ పవర్. కామ్)
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణమయం నిధికి భీమవరం కి చెందిన యిర్రింకి పద్మనాభం, కస్తూరి దంపతుల పేరు మీద వారి కుమారులు సత్యనారయణ, శ్రీనివాస్ శ్రీ అమ్మవారికి సుమారుగా లక్ష పదిహేను వేలు రూపాయలు విలువగల.8 గ్రాముల బంగారం విరాళంగా అందచేసారు.వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ దాతలకు శేషవస్త్రం ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్,అరసవల్లి బాల సుబ్రహ్మణ్యం,మిర్తిపాటి గుణేశ్వరావు, యండ సత్యవతి అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందచేసారు.