Skip to main content

Telugu News Power

అమలాపురంలో ఆక్వా రైతు సదస్సు.

అమలాపురం ఆక్వా రైతు సదస్సు గురించి వివరిస్తున్న అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు

పాలకొల్లు: మే, 23 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆక్వా రైతులు తమ డిమాండ్ల సాధన కోసం ప్రారంభించిన ఉద్యమం లో భాగంగా ఈ నెల 29న అమలాపురంలో రొయ్యల రైతుల సదస్సు నిర్వహిస్తున్నట్టు, జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు శనివారం తెలిపారు. రొయ్య సీడు నాణ్యత, ఫీడు ధరల పెంపు, రొయ్య ద్వారా తగ్గించటం వంటి అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా రొయ్యల రైతులను సమాయత్త పరచడానికి ఈ సమావేశంలో చర్చిస్తామని వెల్లడించారు. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా క్రాఫ్ట్ హాలిడే ప్రకటించడం కూడా వెనుకాడ బోమన్నారు. ఆక్వా రైతు ఉద్యమంలో భాగంగా తక్కువ ధరకు కొనే రొయ్యల ఫ్యాక్టరీలను ముట్టడిస్తామని హెచ్చరించారు. కొందరు దళారులు, రొయ్య ధరలు ఇంకా పడిపోతాయని రైతుల్లో భయాన్ని సృష్టించి అతి తక్కువ ధరకు రొయ్యలు కొనడానికి చేస్తున్న ప్రయత్నాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఏదైనా వైరస్, ఎండ ప్రమాదం వల్ల తప్ప సాధారణ పరిస్థితుల్లో సరుకు అయిన కాడికి అమ్ముకోవడానికి తెగబడవద్దని రైతులకు సూచించారు. ఈ సమావేశంలో సంఘ ఉపాధ్యక్షులు పెనుమత్స సత్యనారాయణ రాజు, గాట్ల సోంబాబు రాజు,మేడిది జాన్ డేవిడ్ రాజు, జి సంజీవరాజు పాల్గొన్నారు.