Skip to main content

Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో చండీ హోమం.

చండీ హోమం నిర్వహిస్తున్న రుత్విక్కులు

భీమవరం: మే,31(తెలుగు న్యూస్ పవర్. కామ్)
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు ఆరాధ్య దైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నందు పౌర్ణమి సందర్భంగా చండీహోమం దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ మరియు వేదపారాయణ దారులు ఘనంగా నిర్వహించారు. ఈ హోమం లో 80 మంది పైగా పాల్గొన్నారు. పరోక్ష పధ్ధతిలో మరి కొంతమంది పాల్గొన్నారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియచేసారు. ఆలయ ధర్మకర్తలు వుదీసి మీనాక్షి, గుసిడి జానకి నాగ శిరీష, పాపొలు ఏడుకొండలు, పలువురు భక్తులు పాల్గొన్నారు.

చండీ హోమం లో పాల్గొన్న భక్తులు