Telugu News Power

రైతన్నగా మంత్రి రామన్న

పొలంలో దుక్కి దున్నుతున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు: మే,31(తెలుగు న్యూస్ పవర్. కామ్) అందరికీ అన్నం పెట్టే అన్నదాతగా కీర్తించబడే రైతు గా వ్యవసాయ క్షేత్రంలో పనిచేయటం తనకు ఎంతో సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తుందని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అధికారిక విధులకు ఆదివారం విరామం కావడంతో, ఉదయాన్నే సైకిల్ పై బయలుదేరి తన స్వగ్రామం లో ఉన్న వ్యవసాయ, ఆక్వాక్షేత్రాలను మంత్రి పరిశీలించారు. రొయ్యల చెరువు వద్ద వాటి ఆరోగ్య పరిస్థితిని, పెరుగుదలను పరిశీలించారు. అక్కడి నుంచి బయలుదేరి వ్యవసాయ క్షేత్రాన్ని చేరుకుని, ట్రాక్టర్ డ్రైవర్ గా స్టీరింగ్ చేపట్టి కొంతసేపు మెట్ట దుక్కు దున్నారు. సాటివారితో కలిసి అక్కడే అల్పాహారం తీసుకున్నారు. స్థానిక స్మశాన వాటిక ఫోను పరిశీలించారు. వారి ఈ ప్రయాణంలో జల్జీవన్ మిషన్ పైపులైన్ పనులు పరిశీలించి, భవిష్యత్తులో సిమెంట్ రోడ్డు వేసేటప్పుడు పైపులైనుకు ఇబ్బంది లేకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ప్రత్యక్షంగా సూచించారు. దారిలో పలువురు గ్రామస్తులు ఆయనను ఆపి ఆశీర్వదించి, తమ అభిమానాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా,మంత్రి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుంచి బయలుదేరి కార్యాలయానికి చేరుకుని, ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. మంత్రి 14 కిలోమీటర్ల ప్రయాణం ఇంధన రహితంగా సాగింది

ప్రయాణంలో ప్రజలతో మాట మంతి