పాలకొల్లు: జూన్, 1 (తెలుగు న్యూస్ పవర్. కామ్)
పాలకొల్లు పట్టణములో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము నందు సోమవారం శ్రీ స్వామి వారి సప్త సోమవారాలు అనగా ఏడు ప్రదక్షిణాలు, ఏడు మారేడు దళములతో మాడవీధులలో భక్తులు సుమారుగా 350 మంది ప్రదక్షిణములలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, ధర్మకర్త నాళంవెంకట సురేక, పి వాసు, ఆలయ ప్రధాన అర్చకులు సన్నిధి రాజు రామకృష్ణమూర్తి ( కిష్టప్ప ) పాల్గొన్నారు. శ్రీ స్వామివార్లకు ధూప సేవ, శ్రీ స్వామి వారి పంచ హారతులు సేవ జరిపారు. కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు ఈ సేవలు నిర్వహించారు.
పెద గోపురం మాడవీధుల్లో భక్తుల ప్రదక్షిణలు.
సప్త ప్రదక్షిణలలో పాల్గొన్న భక్తులు