Telugu News Power

ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా గాంధీ భగవాన్ రాజు.

పాలకొల్లు: జూన్, 2 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. మీరు ప్రస్తుతం జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులుగా పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పాలకొల్లు మండలం, పూలపల్లి వీరి స్వగ్రామం. గతంలో వీరు పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా పనిచేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురంలో జరిగిన రాష్ట్రస్థాయి ఆక్వా రైతు సంఘం సమావేశంలో రైతులు నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా కనుమూరు భాస్కర్ రాజు, ఉపాధ్యక్షులుగా ఈదర యశ్వంత్ కుమార్, కార్యదర్శిగా సిహెచ్ నాగభూషణం, కోశాధికారి గాడి మధుసూదన్ రావు,పాలకొల్లు మండలానికి చెందిన మైకేల్ జాన్ డేవిడ్ రాజు కార్యవర్గ సభ్యులుగా ఎంపికయ్యారు. రాష్ట్ర అధ్యక్షులుగా ఎంపికైన గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆక్వారంగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.