Telugu News Power

క్షీరా రామం దర్శించుకున్న తెలంగాణ వ్యవసాయ కమిషన్ సభ్యులు.

పాలకొల్లు: జూన్, 4 (తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక ణపట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి, పార్వతి అమ్మవార్లను గురువారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్, హైదరాబాద్, సభ్యులు ఎం భవాని రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వారికి శేష వస్త్రముతో సత్కరించి శ్రీ స్వామి వారి చిత్రపటం అందజేసారు. ఆలయ ప్రధాన అర్చకులు అనిల్ కుమార్, కిష్టప్ప వారికీ ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, ఆలయ పర్యవేక్షకులు
పి. వాసు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.