
పాలకొల్లు: జూన్, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక బిజెపి ఆధ్వర్యంలో 12వ ప్రపంచ యోగా దినోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. పాలకొల్లు పట్టణ బిజెపి అధ్యక్షులు కొల్లి కొండ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. యోగ ప్రపంచానికి భారతీయులు అందించిన గొప్ప వరమని కొండ ప్రసాద్ తన ప్రారంభోత్సవం పలుకుల్లో తెలిపారు. యోగ వ్యాయామం మాత్రమే కాదని, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి మూలమన్నారు. యోగ ఒక జీవన విధానం అని, ప్రపంచమంతా సుఖశాంతులతో వెలసినటానికి యోగా గొప్ప సాధనమన్నారు. బిజెపి రాష్ట్ర మీడియా ప్యానల్ ఇంచార్జ్ ఉన్న మాటలు కాబట్టి మాట్లాడుతూ యోగాను విశ్వవ్యాప్తం చేయటంలో ప్రధాని నరేంద్ర మోడీ కృషి ఎనలేనిదన్నారు. వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా, ఆరోగ్య భారతావనిని సృష్టించటానికి ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో తప్పనిసరి భాగంగా చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు గోనుగుంట రంగారావు, మల్లవోలు సురేష్, గవర పవన్ నాయుడు, నాళం బాబి, బెల్లంకొండ నరసింహారావు, కోరాడ సూరిబాబు, వినుకొండ శేషాద్రి, గాదె వెంకటేశ్వరరావు బిజెపి శ్రేణులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
