పాలకొల్లు: జూన్, 21( తెలుగు న్యూస్ పవర్.కాం)
నియోజకవర్గంలో ప్రగతి పట్టాలపై అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నట్టు మంత్రి నిమ్మల పేర్కొన్నారు. స్థానిక 18 వ వార్డు నుంచి 31 వ వార్డు వరకు రూ 3.75 కోట్ల అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఆదివారం కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా రిజిస్టర్ ఆఫీస్ సమీపంలో ఏర్పాటు అయిన సభలో మంత్రి మాట్లాడారు. పట్టణ టిడిపి అధ్యక్షులు గండేటి వెంకటేశ్వరరావు సభకు అధ్యక్షత వహించారు. గత వైసిపి ప్రభుత్వం అభివృద్ధిలో రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కు నెట్టి వేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం పాలన చేపట్టాక అభివృద్ధి పనులకు నిధులు సమకూరుస్తూ, అర్ధరాత్రి అపరాత్రి లేకుండా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో నిధుల కొరత ఉన్న కూడా సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తున్నట్టు వివరించారు. పేదలు ఆకలితో ఉండకూడదని జగన్ ప్రభుత్వం రద్దు చేసిన అన్న క్యాంటీన్ దాతల సహకారంతో నిర్వహించినట్టు మంత్రి తెలిపారు. త్వరలోనే 1526 టిడ్కో ఇల్లు కూడా లబ్ధిదారులకు అందిస్తామన్నారు. ఇక్కడ ప్రజలకు అవసరమైన ఆసుపత్రి, రైతు బజారు వంటి సౌకర్యాలతో కార్పొరేట్ హంగులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో, పెదగోపురం చైర్మన్ మీసాల రామచంద్రరావు, కర్నేని గౌరు నాయుడు, పొట్నూరి ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీనివాస్, బిజెపి రాష్ట్ర మీడియా కన్వీనర్ ఉన్నమట్ల కపర్ది, కొల్లి కొండ ప్రసాద్ జనసేన నాయకులు తులా రామలింగేశ్వర రావు, బిట్ట లక్ష్మీనారాయణ, గాద వెంకన్న, సుబ్బారావు, వాడపల్లి ధర్మకర్త పెండ్యాల భవాని, ఎస్తేరు రాణి, రియా తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు మంత్రికి ఘన స్వాగతం పలుకుతూ, పూల వర్షం కురిపించారు
ప్రగతి పట్టాలపై పరుగులు పెడుతున్న అభివృద్ధి. -మంత్రి నిమ్మల
శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిమ్మల